610
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పగతుర బ్రేమించెడు శక్తిన్ తగబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||
- గుడిలో వినిన నీవాక్యము మా గుండెల బదిలము జేయగను గుడిబయటను నా చారములో నడువగ దోడ్పడుమో కీర్తి యుగయుగము లకు నీ కగుతన్ ||ప్రభువా||
- క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయగనిమ్ము నేస్తవ భావము లోకములో నెరపగ దయగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||