622
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
సర్వము వింతగ పాలనచేయుచు నిన్ను గరుడ విహగ పక్షము లందిడి మిన్ను నొరయగా నడిపి సుఖముగా నిత్యంబు గాచిన ప్రభు నుతింపు.
ఎంతో చమత్కతిగా నా యాత్మ! నిన్ సృజించి క్షేమ మారోగ్యము నెసగగా నడిపించి కష్టములలో బొదివి ఱెక్కలతో బ్రోచిన ప్రభునుతింపు
అందరు గాంచెడులాగు నీ స్థితి దీవించి యాకసమందున నుండి కృపన్ గురిపించి ప్రేమతో జూచు నాతండెవ్వడో శక్తు నా ప్రభు నుతింపు
సకలాంతః కరణంబులతోడ నుతింపు ఆయన నామ ప్రసిద్ధి గీర్తింపు వెలుంగులో నా బ్రహాం సంతతితో ప్రభునుతింపుమి ఆమేన్