a624

624

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవుండవైన యాత్మ! రా నీ వారి నీవు ప్రీతిగా నీ సత్కృపావరంబు నీ నీ ప్రేమ గుమ్మరింపుమీ.
    సమస్త భూ జనంబులు సద్దేవు విశ్వసింపను నీ దివ్య వాక్య కాంతితో నిత్యంబు వారి బిల్తువు.
    దేవా! విశుద్ధ తేజమా! జీవంపు వాక్య మిమ్మయా మా తండ్రియంచు బిల్వను మా దేవుదెల్పి నేర్పుము.
    దుర్భోధ చేయువారిని దూరంబునందు నుంచుమీ మా యేసు క్రీస్తు డొక్కడే ఓదార్చు బోధ కుండిలన్.
    ఓ దివ్య ప్రేమ! యూరటా మోదంబుతోడ మమ్ముల నీదైవ సేవ చేయనీ నాధుండ!! హింస లోర్వనీ
    జీవించి యున్న జచ్చినన్ జీవాత్మముక్తి పొందగన్ మా కిమ్ము నీ బలంబును నమ్మిక గట్టి బర్చుము, ఆమేన్

Post a Comment

Previous Post Next Post