675
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పరదైనున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్ధానము చేయగానే(2) పరలోకమె నా తుది వూపిరిగా పయనించితి ప్రభుకడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె ||ప్రభు||
దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగ వాంఛలతో దిగజారితి చావునకు
యేసు నీరాజ్యములో భువి కేతెంచెడి రోజు ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ||ప్రభు||