4
-
పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్పి
శుద్ధుడ పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె ||రేయి||
-
జిగటమన్నే మానవులంతా పరమకుమ్మరి ప్రభుడవు నీవే
సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా ||రేయి||
-
పెంటకుప్పలనుండి దీనుల పైకిలేపు ప్రభుడవు తగునా
గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవ గడ్డి ||రేయి||
-
నరుల నమ్ముట కంటె నిజముగ నీదు శరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముటకంటె రాజరాజవు నాకాశ్రయము ||రేయి||
-
అగ్నివాసననంటకుండా అబెద్నగోలతో నుండి నదేవా
దానియేలును సింహపుబోనులో ఆదుకొన్న నాధుడ నీవే ||రేయి||
-
పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చు పదము నీవే
అడుగుజాడల నడచిన హనోకు పరముచేరె ప్రాణముతోడ ||రేయి||
-
మృతుల సహితము లేపినావు మృతినిగెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు మృత్యువును మృతిలేపినావు ||రేయి||
సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవే