688
- అడవిరాజు తన పిల్లలను
లేమికలిగి ఆకలిగొనును
దేవుని ఆశ్రిత జనులకు ఎపుడు
మేలులు కొదువై యుండవుగా
- మన ప్రభుండు మహదేవుండు
ఘన మహాత్యము గలరాజు
రక్షణకర్త ప్రధాన కాపరి
ఆయన మేపెడి గొర్రెలము
- వారి గుర్రములు రధములను
బట్టి జనులు గర్వించెదరు
మనమైతే మనదేవుని నీతి
న్యాయములను శ్లాఘించెదము
యేసుని కలిగి యుండెదమ
వెలగల భూషణములకన్న
కల్వరి సిల్వ ధరించెదము