74
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకు ప్రభువుల ప్రభువునకు||వందనమే||
- ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు||వందనమే||
- మరియాతనూజునకు మహిమ గంభీరునకు పరిశుద్ధాచరణునకు బరమేశ్వర నీకు||వందనమే||
- రాజులపై రాజునకు రవికోటి తేజునకు పూజార్హపదాబ్జునకు భువనావన నీకు||వందనమే||
- ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము లర్పింతుము నీకు||వందనమే||