105
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పుట్టు చావులు లేనివాడట పసుల తొట్టిలోపల బుట్టెనేడట ఎట్టి వారలను జే పట్టి పాపము లూడ గొట్టి మోక్షపుత్రోవ బెట్టు వాడట వేగ ||రారె||
బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము. ||రారె||