107
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభు డీయిలను దైవత్వమగు మను ష్యావతారము దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుడును దా నొక్కడు చిర జీవియగు ప్రభు పాపి జీవుల గావ దను జావునకు నొడబడి ||యుదయించి||
యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి ప్రభు రాక గాదంచు మది నెంచి మీదు జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘను డౌ దయాళుడు ప్రాణ మీడుటకు ||నుదయించి||