a109

109

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    చింత లేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున చెంత జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత||

    దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత||

    చుక్క గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన చక్కగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత||

    కన్యగర్భమునందు బుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత||

    పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకు డవతరించెను దాపు జేరిన వారి కిడు గడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత||

Post a Comment

Previous Post Next Post