121
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున ||శ్రీ యేసుండు||
- సత్ర మందున బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం డాయెనందున ||శ్రీ యేసుండు||
- పట్టి పొత్తిగుడ్డలతో జుట్టబడి పసుల తొట్టిలో బరుండబెట్టబడి ||శ్రీ యేసుండు||
- గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ దెల్పె గొప్ప వార్త దూత చల్లగ ||శ్రీ యేసుండు||
- మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషముల బోగొట్టను ||శ్రీ యేసుండు||
- పరలోకపు సైన్యంబు గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు||
- అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||