a122

122

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు ||లాలి||

  1. పరలోక దేవుని తనయుడో యమ్మా పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా ||లాలి||

  2. ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ మహి పాలనము జేయు మహితుడో యమ్మా ||లాలి||

  3. ఆద్యంతములు లేని దేవుడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా ||లాలి||

  4. యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా ||లాలి||

  5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలి||

Post a Comment

Previous Post Next Post