a130

130

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    క్రైస్తవులారా! లెండి యీనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుడి; ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆసక్తిపరులై కీర్తించుడి క్రీస్తేను మానవాళితోడను నశింపవచ్చెనంచు పాడుడి.దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకతించెనుః 'ఈ వేళ మహా సంతోషంబగు సువార్త నేను ఎరిగింతును. దావీదు పట్నమం దీదినము దైవరక్షకుడు జన్మించెను.'త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచు నీలాగు పాడెను 'సర్వోన్న తాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనియ్యుడు'.పరమతండ్రి దయారసము నరులకెంతో నాశ్చర్యము నరావతారుడగు దేవుడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులన్ ప్రేమించుచుండెను.శ్రీ మాత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము; ఈ దినమందు నుద్భవించిన యా దివ్యకర్తను వీక్షింతుము; సదయుడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము.

Post a Comment

Previous Post Next Post