a141

141

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము శరణం ||వర||

  1. పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి యౌ క్రీస్తు ||వర||

  2. సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు ||వర||

  3. యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో పాదుకొన్న క్రీస్తు ||వర||

  4. ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితుల జేయుగ సిలువ నొందిన క్రీస్తు ||వర||

  5. ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును క్రీస్తు ||వర||

  6. కొల్లగాను బాప మెల్ల జేసి దాని కుల్లములోదల్ల డిల్లువారికి క్రీస్తు ||వర||

Post a Comment

Previous Post Next Post