143
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నరుల పాప హరణమునకై నరుడయ్యె మనసా పరమ పుర ద్వారంబు మనకు తెరచెనే మనసా ||శ్రీ||
- నరుల పాప శాప ఫలము నరకమే మనసా ఆ మరణమును తొలంచప్రభువే నుడిసె నేమనసా ||శ్రీ||
- పాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే గదా ప్రభువే ప్రాయశ్చిత్త బలియై పరగెనే మనసా ||శ్రీ||
- సిలువవేసి ప్రభుని ప్రజలు చంపిరే మనసా ఆ బలుడు తిరిగి లేచి మృతిని గెలిచేనే మనసా ||శ్రీ||
- గెలిచి యేసు హితులమధ్య నిలిచెనే మనసా నిలిచి సమాధాన మంచు పలికెనే మనసా ||శ్రీ||
- పునరుత్థాన మేసు దేవ పుత్రుడని మహా ఘనముగా ప్రకటించుచుండ కాననే మనసా ||శ్రీ||
- తానె మార్గం తానెసత్యం తానెజీవము ఈ ఘన సత్యంబు నమ్మునరులు ధన్యులే మనసా ||శ్రీ||
- నిన్ను నీ వెరింగి ప్రభుని నెరుగ వే మనసా సన్నుతు డందుల కొసంగె సత్యవేదము ||శ్రీ||
- పాపములకు పరితపించి ప్రభుని జేరవే దాపునకు రమ్మంచు కరము చాపేనే మనసా ||శ్రీ||
- ఎంత ఘోరపాపమైన నెంచడే మనసా ఎంత మొత్తమైనను క్షమి యించునే మనసా ||శ్రీ||
- బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు మనసా ఈ బతుక్నందె ప్రభుని పదము పట్టుకో మనసా ||శ్రీ||
- జనక కుమారాత్మ దేవున్ జపియించు మనసా అనయమును స్మరించు స్వర్గ మద్దియే మనసా ||శ్రీ||