a151

151

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన||

  1. పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ వీక్షించి రొక్క పు ట్టంధకుని అందు గొందఱు శిష్యు లాత్మలో భావించి రెందు కీతడు చీక య్యెను దీని విధమేమో డెందములను గల్గు సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని మనుజ నందనుని నడిగిరప్పు ||డందమైన||

  2. చీకువాడై జన్మించుటకు జేసెనా దుష్కృతము నితడు లేక వీని జననీ జనకు లేమి చేసిరో యీ కారణము దెల్పు మోకర్త యిపుడీవు మాకంచు తను వేడ లోకేశ్వరుండు ని రాకారు డితనియం దీకార్యములు జూప బ్రాకటముగ జేసె గాక వేరొకవిధము లేకున్నదని తెల్పి చీకు బ్రోవ దలంచె ||నందమైన||

  3. బురద వాని కన్నులందు గరములతో జమిరియొక్క చెఱవులో బ్రాక్షాళించుటకు సెలవిచ్చె బ్రభువు బిరబిర నయ్యంధు డరిగి యేసుని పల్కు దిరముగ మదినమ్మి సరసిలో మునిగి సుం దరమైన నేత్రముల్ ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి నరులబ్బురముగ జూ చిరి మార్మోమగువాని ||నందమైన||

  4. చూపులేని గ్రుడ్డివాని జూడ గలుగజేయువాడే పాపాంధకార మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లో బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములు బట్టి చూపు లోపలి చూపు జూచి యానందింత ||మందమైన||

Post a Comment

Previous Post Next Post