a152

152

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య జనులకు గల్గిన, విధమెట్లొ తరచి ||కనరె||

  1. నక్షత్రమార్గాన జ్ఞానుల్ బోయి రక్షకుని జూచిరి రక్తిమీరంగ కాంక్షతో ప్రభునికి మ్రొక్కి కాంకల్ కాంతిమీరగ నిచ్చి తరలిరి పరగన్ ||కనరె||

  2. పదియు రెండేడ్ల, ప్రాయమున ప్రభువు పస్కాపండుగునకు పరగబోయెనుగ ముదమొప్ప దేవాలయములో జేరి ముద్దుగ బోధించె బోధకులకును ||కనరె||

  3. కానాయూరి పెండ్లికరిగి ప్రభువు ఘనముగ నీళ్లు ద్రాక్షా రసముగజేసెన్ తనరమహిమను బయలుపరచి శిష్యుల మనములబలపర్చె ఘన విశ్వాసమున ||కనరె||

  4. కుష్థరోగి యొకడువచ్చి తనదు కుష్ఠరోగము బాప ప్రభునివేడంగ ఇష్టబుద్ధితో ప్రభువువాని ముట్టి కుష్ఠురోగము బాపె కోర్కెలూరంగ ||కనరె||

  5. శతాధిపతి విశ్వాసమును ప్రభువు తరచి చూచి మెచ్చి దయజూపె గనరె హితవుగవాని దాసుని పక్ష వాతంబు స్వస్థత మరిగావించెనుగ ||కనరె||

  6. గాలివానల విప్లవంబు ప్రభువు గద్దించి సద్దణిపి ఘనమహిమజూపె గాలిసంద్రముపైన హక్కు ప్రభునికి గలదంచు శిష్యులు ఘనపరచిరిగ ||కనరె||

  7. ఇట్టిశక్తిగల ప్రభుని మనము గట్టిగనమ్మిన గలుగు రక్షణము పట్టువీడక ప్రభునినెపుడు గుల్పి పరమశాంతిని బొంది మరివెలుగగలము ||కనరె||

Post a Comment

Previous Post Next Post