a157

157

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల రోగముల్ వెంటనే తొలగి పోయెను నిజముగ ||యేసు||

  1. గుంపుకూడిన జనులతో బ్రభు యేసు సొంపుతో బోవునపుడు తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను ||యేసు||

  2. అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలో ప్రభువు యెఱిగి తనయొక్క వింత జూపెను జనులకు ||యేసు||

  3. ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచు ప్రభువు చెప్పె వణుకుతో గజయాన వచ్చి నిల్చె ||యేసు||

  4. ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు||

  5. ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుడి ఆపదలు దొలగించును నిజముగ పాపముక్తుల జేయును ||యేసు||

Post a Comment

Previous Post Next Post