158
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే ||సీయోను||
- హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపుల బ్రోచు తాల్మిరక్షకుడితడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను ||సీయోను||
- ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపు డితడు ||సీయోను||
- వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు ||సీయోను||