a162

162

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుడు లేడు ఎన్న రాని మన యఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న||

  1. మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||

  2. నిజ రక్షకుడితడే మన వృజినాదుల బరిమార్పను విజయం బగు నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||

  3. దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముజూపెను చక్కనీ గుణముల సొం పెక్కి వర్తించె నహహ ||యన్న||

  4. ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలో గల దుర్గుణాది జాలంబుల గడ ద్రోయును ||అన్న||

  5. మృతి గెల్చిన వాడే దు రిత జీవుల బ్రోవ దగును మృతి నొంది నశించు లోక మూఢాత్ముల కేల గల్గు ||నన్న||

Post a Comment

Previous Post Next Post