a163

163

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా యిడుగో గొఱ్ఱెలకాపరి కడగానరాని కారడవిలో నలసట పడెడు గొఱ్ఱెలను పేరిడిబిల్చి రక్షించు ||నిడుగో||

  1. చెదిరిపోయిన గొఱ్ఱెనై దొడ్డికిబోవ ముదములేనివాడనై మృదుమధురంపు నీ నాదమా లించక కర్త కొదిగి యుండక మూఢ హృదయుడనైతి ||నిడుగో||

  2. దూరంబునకుబోతిని జనకుని కృపా సారంబు గొననైతిని కారు మూర్ఖపుపిల్ల గా సంచరించినా కూరిమి యిలుబాసి దారి దొలగిపోతి ||నిడుగో||

  3. తనదు గొఱ్ఱెను జూచెను బోయడు తండ్రి తనశిశువును గాంచెను కనికరమెదలో నిం డినవారలై నన్ను వన గిరికటకాదు లను వెంబడించిరి ||ఇడుగో||

  4. ప్రాణావసర మప్పుడు యేకాకినై క్షీణించియున్నప్పుడు త్రాణార్థమగు నెనరు త్రాళ్లతో ననుగట్టి నాణెంబుగా(దెచ్చి నన్ను రక్షించెను ||ఇడుగో||

  5. చెడుగు మెకములవల్లను బాధలనొంది కడుమలినమై యుండను కడిగి గాయములన్ని గట్టి శుభ్రముచేసి తడయక నాయింట నిడి నెమ్మది యొసంగె ||నిడుగో||

  6. ప్రభుయేసు నా బోయడు యీతడె భూమి నభము లేలెడి రాయ డు శుభమైన తనదివ్య శోణిత మొసగియ వ్విభుడు ప్రేమించి దీ వించి స్వస్థముజేసె ||నిడుగో||

  7. నన్ను దొడ్డిని బెట్టెను పోయినగొఱ్ఱె తెన్ను వెదకిపట్టెను సన్నంపు పచ్చిక యున్ను జీవనపూట లున్ను గల్గెడిచోట్ల నన్నుంచి రక్షించె ||నిడుగో||

  8. నేను మూర్ఖపుగొఱ్ఱెనై లోబడకుంటి మానసమున వెర్రినై పూని యిప్పుడు కాచే వాని శబ్దము ప్రేమ తో నాలింపుచు దొడ్డి నానందముననుందు ||నిడుగో||

  9. చెడ్డబిడ్డనై యుంటిని యిటునటుబోవ నెడ్డెతనము గొంటిని మెడ్డులేకిపుడు ప్రే మింతు నా ప్రియజనకు దొడ్డ శబ్దము వాంఛిం తును ముక్తి నిలయంబు ||ఇడుగో||

Post a Comment

Previous Post Next Post