a164

164

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఈయనా యేసు రక్షకుడు తన దాయమని రక్షింప దలచెనా నన్ను నీయనా యేసు రక్షకుడు ఆయాసమగు నొక్క మోపు నే మోయలేకుండ నా మూపుపై నుండ శ్రేయఃకరపు సిలువజూపి నాకు హాయి నిచ్చెను భార మంత వెడలించి ||యీయనా||

  1. దురితాత్ముడని త్రోయకుండ నన్ను బరిశుద్ధుడా యేసు ప్రభుడు కరుణింప ధరణిలో నిది మహాద్భుతము నే మరుతునా యీ ప్రేమ మరణమౌ దాక ||ఈయనా||

  2. ఓపగూడని దుష్కృతంబుల్ నేను తేపతేపకు జేసి ద్వేషినై యుండ గోప మింతైన రానీక నన్ను గాపురుషు డని తాను ఖండింప డాయె ||నీయనా||

  3. మనస్తమో గుణము లెడబాపెన్ నా దినకరోదయ మట్లు దీప్తిమది మించెన్ తన పాదముల జాడ లబ్బెన్ సదా వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుగు ||నీయనా||

  4. హతు డయ్యె నాయేసు నాకై దు ర్గతి తొలగి నాకు మో క్షమే గల్గు కొఱకు అతి దయాదీర్ఘశాంతుండే దైవ సుతు డని యెఱిగితి శోధింపగాను ||ఈయనా||

  5. దీవింపదగు నతని సిలువ నా జీవాంతమగు దనుక చెలగి మోయుచును ఈ వసుంధర జనుల కెల్ల మీరు సేవించు డేసునని చెప్పి చాటుదును ||ఈయనా||

Post a Comment

Previous Post Next Post