a166

166

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా దోషియైన నన్ను బ్రోవ నీసుప్రాణమిడితివా ||యేసురాజా||

  1. మంచివాని కొరకు నొకడు మరణ మొందుటరుదుగా అంచితమగు ప్రేమ చేత మించి గాయము లొందినా ||వేసు||

  2. చెయ్యరాని దుష్కర్మములు చేసి నే చెడియుండగా అయ్యో మ్రానుమీ దికీవు ఇయ్యకొని మోసితివా ||యేసు||

  3. గెత్సేమనె వనములోకి జొచ్చి తండ్రికి చిత్తమై యిచ్చిన నా శ్రమలపాత్రన్ బుచ్చుకొని భరించినా ||వేసు||

  4. హస్తము,పాదము,ప్రక్కలు మస్తకపు గాయములలో విస్తరించి చిందె నీ ప్ర శస్త రక్తమంతయున్ ||యేసు||

  5. కొండమీద నిన్నుజూడ గుండెలదిరిపోవునే నిండు ప్రేమ చేత నావగు మెండుబాధల నోర్చినా ||వేసురాజా||

  6. మరువలేను నీదు ప్రేమ మరణపరియంతంబు నా నరక బాధలన్ని నీవా కొరతపై వహించినా ||వేసురాజా||

  7. నిన్నుదలచ నా నిరీక్షణ యున్నతము గానుండును యెన్నడు నీ మహిమను నా కన్నులారజూతునో ||యేసురాజా||

Post a Comment

Previous Post Next Post