a168

168

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాల పడితి పాలన సేయవే ధరజనంబులుసేయు బహువిధ దురితములు క్షమియించి సద్గతి తెరవు జూపి తరింపజేసెడి దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక||

  1. క్షితి నబ్ధి తీర పై కతయైన నెన్ననా యితియౌను లెక్కింపగా కుతల జన్మంబెత్తియేనిట బ్రతుకు దినముల జేయునఘములు మతి దలపనిమితా యుతంబులు పతితు డనునాగతి యెరుంగను ||పరమరక్షక||

  2. పసలేని మాయా దు ర్వ్యసనంబులను జెంది దెసదప్పి యున్నాడను వసుధలో దుష్టునికి లోబడి మసలజాలని బలహీనత గసటు కన్నులగప్పి కడు మా నసము దూలి విలాపినైతిని ||పరమరక్షక||

  3. మదితప్పి గొఱ్ఱెల మంద బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు వదలకెపుడు దురాత్మలైరి స ముదయమున బడితిరిగి వడిచెడి మదికి విశ్రమమేమి లేమిని హృదయ సంతాపముల సుడిబడి ||పరమరక్షక||

  4. మదపున్నాగము భంగి మత్తిల్లి దుర్భావ హృదయుడనై చెడితిని గొదగొనుచు గాయములతో నా యెద దృఢంబించుకయు లేమిని గదల శక్యము గాక మూల్గుచు గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమరక్షక||

  5. అమిత దురాత్ముడ నని కడ ద్రోయక క్షమియింపు మీ కరుణచే తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు తమము గప్పియు గలుషకానన సమితిలోబడి శ్రమలు నొందుచు ||పరమరక్షక||

Post a Comment

Previous Post Next Post