a169

169

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పాపి కాశ్రయుడవు నీవే యేసు నీవేఉన్నత లోకము విడిచిన నీవే కన్నియ గర్భమున బుట్టిన నీవే యేసు నీవే ||పాపి||

  1. అజ్ఞాన నాశన బ్రధ్నుడవు నీవే విజ్ఞాన దాయక పరగురువు నీవే యేసు నీవే ||పాపి||

  2. చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే యేసు నీవే ||పాపి||

  3. రోగిష్ఠులకు స్వస్థ ప్రదుడవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొఱవిను నీవే యేసు నీవే ||పాపి||

  4. నర పుత్రులకు నీతి గరపించు నీవే కరము చాపి కష్టములు ద్రోయు నీవే యేసు నీవే ||పాపి||

  5. శాత్రవాంతరమున మృతుడవు నీవే మైత్రి జూపగ మృత్యుద్ధతుడవు నీవే యేసు నీవే ||పాపి||

  6. భవ దీయ పదకంజ దాసుండ నేనే భవ మగ్ను నను ముక్తు జేయుము నీవే యేసు నీవే ||పాపి||

Post a Comment

Previous Post Next Post