a170

170

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షము బొందుటకు దోసపు లోకము లోనికి వచ్చితి దోషుల బ్రోచుటకు ||యేసు||

  1. పరిశుద్ధుడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు ||యేసు||

  2. సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యము జేయుచు నీ కృప చాల యిలలో దెల్పితివే ||యేసు||

  3. అతి పుణ్యాత్ముడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు మూడవ దినమున బ్రతికియు లేచితివే ||యేసు||

  4. పాపుల మని తెలిసి నీదగు దాపున జేరగనే పాపము బాపుచు ప్రాపుగ నుండెడి ప్రభుడవు నీవెగదా ||యేసు||

  5. దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుడా నిరతము మమ్మును నీ కృప లోపల నిలకడగా బెంచు ||యేసు||

  6. నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణగలిగి సారెకు వేడెద ముర్వికి రక్షణ కారకుడా నిన్ను ||యేసు||

Post a Comment

Previous Post Next Post