178
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఒకడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింప దల చెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుడగు యూదాను మొనసె వీడనుచు దెలిపి యిక మిమ్ముగూడియుం డకయుందునని రొట్టె విరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుడని పిదప నొక పాత్ర నాన నిచ్చెన్ ద్రాక్షారసం ||బా యంధ||
- తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకు నొనరంగ ద్రాక్షారస మును గురుతుగా దెలిపి నెనరుగల కర్త యపుడు చనె గెత్సెమను వన స్థలిలోన శిష్యుల నునిచి తానొక్కరుండు మనసు వ్యాకులము చే తను నిండియుండగా ఘనుడు ప్రార్ధించెదండ్రిన్ గాఢముగాను ||ఆ యంధ||
- శ్రమచేత దన శరీ రము నుండి దిగజారె జెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపా పము జూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమముగా దూత తన కడ కరుగుదెంచి శాం తము బల్కి చనిన పిదపం తమ మనంబుల బోలు తమసమున యూద సై న్యము లేగుదెంచె నపుడు గెత్సెమను పనికి ||నా యంధ||
- పరశాంతి శీల స ర్వజ్ఞతలు గల ప్రభుం డెరిగి తనకున్న పాట్లు పరిపంధి గణముతో బలికె మీరిచ్చోట నరయుచున్నా రెవనిని నరులు నజరేతు యే సను వాని ననగ దా నెఱిగించె నేనేయని గురుదీప శిఖల సో కు పతంగముల భంగి ధరణిపై బడిరి వారల్ దర్పము లణగి ||యా యంధ||
- తన శిష్యులను విడువు డని రిపులచే దానె పట్టువడియెన్ కినిపి పేతురు యాజ కుని దాసు కర్ణంబు దునుమంగ క్రీస్తుడపుడు కనికరంబున స్వస్థ తను జేయు నావిభుని కరములను విరిచి కట్టి వెనుక ముందర జుట్టు కొని యెరూషలేము పుర మునకు దీనుక బోయిరి రాణువవార ||లా యంధ||