a183

183

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా యాత్మలో బలుమాఱు దలపగా దాలిమి లేదాయెను హా యీ జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువజాల ||సిలువ||

  1. ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా దురితముల్ బాపను కరుణచే జనుదెంచి మరణము నొందితివా ||సిలువ||

  2. కలువరి మెట్టపై కాలు సేతు లెల్ల చీలలతో గ్రుచ్చిపట్టి యా సిలువకు గొట్టగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా ||సిలువ||

  3. మెట్టపైన నిన్ను పెట్టిన బాధ నే బట్టి తలంపగను ఆహా పట్టైన నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను ||సిలువ||

  4. పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపగను హానా మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి ||సిలువ||

Post a Comment

Previous Post Next Post