a196

196

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా దోషమేగదా ||యాహా||

  1. "వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్" కోరి తిటులు నిన్ను జంపు క్రూరజనులకై ||యాహా||

  2. "నీవు నాతో బరదైనున నేడె యుందువు" పావనుండ యిట్లు బలికి పాపి గాచితి ||వాహా||

  3. "అమ్మా! నీ నుతుడ" టంచు మరి యమ్మతో బలికి క్రమ్మర "నీ జనని" యంచు గర్త నుడివితి ||వాహా||

  4. "నా దేవ దేవ యేమి విడ నాడితి" వనుచు శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్పశక్యమా ||యాహా||

  5. "దప్పికొనుచున్నా న" టంచు జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద నేమి నీకు హా! ||యాహా||

  6. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా "సమాప్తమైన" దంచు దెలిపి సమసితివి గదా ||యాహా||

  7. "అప్పగింతు దండ్రి నీకు నాత్మ" నంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ||యాహా||

Post a Comment

Previous Post Next Post