198
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా ||నీ సిలువే||
- సిలువను జూచుకొలది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||నీ సిలువే||
- సిలువను దరచి తరచితి విలువ కందగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపగ జాలును రా ||నీ సిలువే||
- పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను నిలచినాడను రా ||నీ సిలువే||
- శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా ||నీ సిలువే||