206
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నజరేతు పుర విహారా నరుల బ్రోవ నరు దెంచినావా నజరేతు పురవిహారా ప్రజలపాపము బరిహరించియు ప్రజల సద్గతి నొంద జేయను విజయమును బొందితివి యిలలో సజనులందరు భజనసేయ గ ||నజరేతు||
- మరియయనే కన్యకుమారా నరకబాధ దప్పించినావా మరియయనే కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను మీరెగాకిక వేరేలేరని సారెసారెకు జెప్పినావా ||మరియయనే||
- మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను||
- పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను ధరను మా పాపములు గడుగను చిరముగా ను త్త రమునాయె ||పరమతండ్రి||