a208

208

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపజేయు ||హర్షమే||

  1. ఆర్యుడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయగ సూర్యరశ్మి దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట ||హర్షమే||

  2. మారణము దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం జీవించి మఱలను దామెరుసలేమందు జొచ్చుట ||హర్షమే||

  3. పొరిపొరిం గాసించు చొక త స్కరుడు వధ్యాస్తంభమున న నర్మువ కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట ||హర్షమే||

  4. ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను రెండుగా జన జాల మాశ్చర్యమున బొందుట ||హర్షమే||

  5. సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవుని బితాయని పిలిచి వీరింగావు మంచును బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే||

  6. నెయ్యమున విభు డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయగ వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట ||హర్షమే||

  7. కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని దామీట నేనిక మేటి జీవకిరీట మొందుట ||హర్షమే||

Post a Comment

Previous Post Next Post