209
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార భూలోకమునదనివి దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక పూజింతు మీర ||నా కొఱకు||
- కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నే గల్గుటంగాన విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా కొఱకు||
- కీటకమువంటి నను బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ వాటమా తన కిటుల గావ నేను వర్ణింప గన్నీరు వరదలైపోవ ||నా కొఱకు||
- ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ మౌనమైయిలను ||నా కొఱకు||
- ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు కర్తను భజింతున్ ||నా కొఱకు||
- చేయనిక పాప సంగతము నాడు సిలువపై జచ్చిన శ్రీకరుని కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాక ప్రార్థింతు సతము ||నా కొఱకు||