225
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఘోర పాపభారముతోడ దరిగానలేక దిరుగుచుండినట్టి మమ్మును కూరిమితో దరికిబిలిచి భారమును నీవేమోసి ఊరకమము క్షమియించి నేరములను బాపిన ప్రభో ||పరమ||
- సిలువమరణమొందిన ప్రభువా ఇలనరుల ఘోర కలుషములను బాపిన ప్రభువా విలువలేని నీదు బ్రతుకు బలముగల నీ ప్రేమ సేవ సలితముగ ననుకరించి ఇలను మేము బ్రతుకునట్లు ||పరమ||
- చెఱను చెఱగబట్టిన ప్రభువా ధనరులకెల్ల వరములను విరివి నిడితివా పరముకేగి పరమతండ్రి పరమున కుడిపార్శ్వమందు దిరముగా గూర్చుండి యుండి తిరిగి ధరకు వచ్చెదవా ||పరమ||
- నీదు రాక కెదురుజూచెడి నీ దాసులను సదయతతో జూడుమో ప్రభో మాదినపు ప్రార్థనలను మాదు స్తోత్రములను మిగుల బ్రోదిగా గైకొనుచు నేడు బ్రోవుమయ్య మమ్ములను ||పరమ||
- పంపుమయ్య నీదు ఆత్మను పదిలముగ దయతో సొంపుగ నీ శుద్ధాత్మను నింపుమయ్య నీదు కృపతో ఇంపగు నీవరములతో సొంపు గాను నీదు సేవ జేయనిలను నెల్లపుడు ||పరమ||