224
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యెరూషలేమందుండి మీ రెదురు చూడుడి మీపై బరిశుద్ధాత్మయు దిగివచ్చి పనులు దెల్పును ||ఇదిగో||
- దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండ బరిశు ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||
- నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేల ||నిదిగో||
- ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుడి నాదు సకలాజ్ఞలందు నిదియె సార మనుకొనుడి ||యిదిగో||
- ఏదైననా పేరిటమీ రించుక వేడినను మీకు మోదముతోడదాని ముందే చేయుదును ||ఇదిగో||
- ఉల్లము లందు గలత లెల్ల విడువుడి నేను మళ్లి వచ్చెడి విధము మరువకుండుడి ||యిదిగో||