a223

223

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద వినరే ప్రియులార వాస్తవముగ మరణించి బ్రతికెనని వసుధలో బ్రకటింపరె యూరూర ||గ్రీస్తు||

  1. మరియ మగ్దలేనెకు బ్రథమంబున మన గురువర్యుం డగపడియె తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియె ||గ్రీస్తు||

  2. సీమో నను పేతురును గూడ ద ర్శించె నతడు మూడవ మాఱు ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకు బ్రియ మొనరించె మఱొక తీఱు ||క్రీస్తు||

  3. తోమాలేని తరుణమున బదుగురి తో వచించె గృహమున జేరి తోమాకు కనపడి యతని సంశయము దొలగించెను బ్రభు డొకసారి ||క్రీస్తు||

  4. సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయు గూర్చె ||క్రీస్తు||

  5. ప్రభు డొక మాఱే నూరుగురి దా బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ మొసంగి యపొస్తలులకు క్రీ స్తారోహణు డయ్యెను గూర్మి ||క్రీస్తు||

  6. హత్య జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము ||క్రీస్తు||

Post a Comment

Previous Post Next Post