a228

228

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నాడు వచ్చినట్లు గాదు నేడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు నింక జొత్తు మెచ్చుట ||నాడు||

  1. మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు గుండె దిగులుగా ||నాడు||

  2. దాసునివలె దొల్లి జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాడుగా ||నాడు||

  3. ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెగా పిడుగు రీతి వాని యుగ్రమైన దృష్టి హెచ్చగా ||నాడు||

  4. కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి మండు నగ్ని యదిగో వచ్చెగా ||నాడు||

  5. దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకు బోయి చెడితిమి ||నాడు||

  6. వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధ బొంది నరకాగ్నిలో బడబాలైతిమి ||నాడు||

Post a Comment

Previous Post Next Post