a231

231

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచు క్రీస్తుని దయను గోరండి ||ఓహో||

  1. అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకు బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహో||

  2. మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహో||

  3. అంధకారమగును సూర్యుడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును ||ఓహో||

  4. కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహో||

  5. నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దాని జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహో||

  6. ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహో||

  7. కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను ||ఓహో||

  8. కల్లలాడుచుడి ప్రొద్దు గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే ||ఓహో||

  9. ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహో||

  10. జాతి గోత్రమడుగ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతడు ||ఓహో||

Post a Comment

Previous Post Next Post