232
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- భువిలో రాల కర్రల పూజలజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి నెంతో ||కోప||
- నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు ఇరుగు పొరుగు వారి నిక మోసములు చేయు నరులందఱు చెడ్డ నరకములో బడునట్టి ||కోప||
- ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో బడి కాలే ||కోప||
- కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు ఇల మాయవాదుల కిక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల పాలయ్యెడు ||కోప||
- మీది దేవునివలనను యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము ఆధారమైయుండు నాత్మరక్షణ కది సాధులైనమ్మని భేదకులకు నెంతో ||కోప||