233
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||
- ఒనరగనుదన మేఘ సింహా సనముపై గూర్చుండి పావన జనుల బారుల నిరుపార్శ్వము లను విభజనము జేయు నిక్కము ||వచ్చును||
- అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లగ ||వచ్చును||
- అమిత పాపాత్ముల నరకలో కమున బడవైచి సుజన సమూ హముల దనవెను వెంట గొని చను విమల నిత్య కిరీటము లొసగ ||వచ్చును||
- తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి నొక్కరు నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||