234
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి ఓరిమితో నుండరే భద్రముగా శత్రుయుపద్రవమును దాటి సిద్ధపడుడి ప్రభునియొద్ద నివసించుటకు ||యేసు||
- తనువును బలిపెట్టిన మన రక్షకుడు ఘన మహిమలోకి వెళ్లి తన యింట స్థలములు మనకు సిద్ధముజేసి చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము. ||యేసు||
- చాలారాత్రి గతించెను సోదరులారా వెలుగు సమీపించెను వేల దూతలతోడ యేసయ్యవచ్చును కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు||
- శోధన కాలమీదే యీధరణిలో బాధలురావచ్చును నాధుడైన యేసుపాదముల కడనుండ యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు||
- మనలను బ్రేమించుచూ మన పాపముల దనరక్తమున గడుగుచు ఘన దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత ||యేసు||