a238

238

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టి పారజేయుము ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము దయారసముచే ||దైవాత్మా||

  1. దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలన బ్రవచించిరి పావురమా దిగి మాలో వసించుము పాపుము చీకటి వెలుగుచు మాలో ||దైవాత్మా||

  2. రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల నావ రించు రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు గానగు లోకుల మీదికి ముదమున ||దైవాత్మా||

  3. మే మజ్ఞానాంధకారమునను మునిగితిమి గాన చెదరగజేయు మంధకారము పామర జనులకు బేర్మితో నొసగు ను జ్ఞాన ప్రకా శము నిల్పుము మాలో ||దైవాత్మా||

Post a Comment

Previous Post Next Post