a237

237

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా దురతేచ్ఛలను దూర పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ||

  1. నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ||

  2. జీవమార్గంబున జీవింప నేర్పి త్రోవ దప్పిన వారి భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ||

  3. పాపాంధకారంబు బాపు నీ వెలుగు జూపి మింటికి నడిపి కాపాడి మెలగు ||పరిశుద్ధాత్మ||

  4. భక్తుడు శోధింప బడుచుండునేని యుక్తి దెల్పెడి సర్వ శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ||

  5. తిన్ననైన తెలివి తేట నాకిమ్ము నిన్ను సేవించెద నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ||

Post a Comment

Previous Post Next Post