a236

236

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రాజాధి రాజా రారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా రవికోటితేజ యేసురారా|| ఓ...మేఘ వాహనంబుమీద వేగమే ఓ.. మించు వైభవంబుతోడ వేగమే ||రాజాధి||

  1. ఓ...భూజనంబులెల్ల తేరిచూడగా ఓ...నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబుసేయ భూరాజులెల్ల గూలిపోవ భూమియాకసంబు మారిపోవ నీ మహా ప్రభావమునవేగ ||రాజాధి||

  2. ఆ...ఆకసమున దూత లార్భటింపగా ఆ ఆదిభక్త సంఘసమేతంబుగా ఆకసంబు మధ్యవీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాధ! నీదు మహిమలోన మాకదే మహానందమౌగ ||రాజాధి||

  3. ఓ...పరమ యెరుషలేము పుణ్యసంఘమా ఓ...గొఱియపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా పరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజుపేర క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||

Post a Comment

Previous Post Next Post