a252

252

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవు డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవు డిచ్చిన||

  1. భయముతో భక్తితో జదివిన ప్రాపు క్రీస్తు డటంచు దెల్పును దయా మయుడగు దేవుడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవు డిచ్చిన||

  2. సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవు డిచ్చిన||

  3. ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుడు దోసములు నెడబాసి మోక్షపు ద్రోవ గోరిన వారలెల్లరు ||దేవు డిచ్చిన||

  4. పాపములలో నుండి విడుదల పరమ సుఖ మని దలతు రేనియు తాప మార్పును లేచి రండి త్వరగ క్రీస్తుని శరణు బొందను ||దేవు డిచ్చిన||

  5. దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవు డిచ్చిన||

  6. మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయగ రండి వేగము ||దేవు డిచ్చిన||

  7. నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవు డిచ్చిన||

  8. మోక్ష రాజ్యము జేర గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవు డిచ్చిన||

Post a Comment

Previous Post Next Post