a251

251

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను వారి కవి యెంతో ధైర్యముల్ మనసు లొక్కటి జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ చనుదెంచె వారిపై ||వినరే||

  1. పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర ముగ వార లం దరు గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై తన్నాదము ||వినరే||

  2. అనలార్చులను దీప్తి మించుచు బీట లగు జిహ్వల్వలె గనుపించుచు ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వ గను బరిశుద్ధాత్మచే తను నింపబడి రంత ||వినరే||

  3. వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ ||వినరే||

  4. ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవుని గొల్చి తా మందరు చూడగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని దయచేత ||వినరే||

  5. మనము నా రీతిగ గుంపుగా గూడి మన దేవు గొల్వగ భూమిలో మనుజుల కాశ్చర్య మగు కార్యముల జేయ నొనగూడు మనసు కా నందమును గల్గు ||వినరే||

Post a Comment

Previous Post Next Post