a250

250

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరిశుద్ధాత్ముని బొందుము ప్రభువిచ్చెడు వరసహాయుని బొం దుము పరిశుద్ధవర్తనకు పరమసాహాయ్యంబు పరముజేరువఱకు పరి పూర్తిగా దొరకు ||పరి||

  1. పరిశుద్ధాత్ముని గల్గిన మన రక్షణ పరిపూర్ణమై యుండును పరమ రక్షకుడిచ్చు పరిపూర్ణ రక్షణను పరమానందముతోడ పరగగైకొను మిపుడే ||పరి||

  2. పరిశుద్ధాత్ముని గల్గిన బైబిలువాక్య పరమసారము తేటగున్ పర మండలపు తండ్రి పరిశుద్ధచిత్తంబు పొరపాటులేకుండ విరివిరిగా దెలియును ||పరి||

  3. పరిశుద్ధాత్ముని గల్గిన బ్రార్థనలందు పరమ పాటవ మబ్బును సరిగా బ్రార్థించెడు సరణియు దెలియును వరములను బొందుటకు తెరువులభియించును ||పరి||

  4. పరిశుద్ధాత్ముని గల్గిన శోధనముల పరమ విజయము గల్గును దురితంపు శోధనల దొలగింప నా ప్రభువు పరమశక్తినొసంగి కరుణతో జయమిచ్చు ||పరి||

  5. పరిశుద్ధాత్ముని గల్గిన జీవితమెల్ల పరిశుద్ధముగ నుండును పరిశుద్ధ జీవితము కరము సాధ్యంబగును పరిశుద్ధాత్ముని శక్తిన్ వర్తింపగలమట్లు ||పరి||

Post a Comment

Previous Post Next Post