249
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- లోకయాత్ర చేయునప్పుడు చీ కాకుపడిన మాకు నీవె మార్గ దర్శివై వీక నొసగి మాకరంబు జేకొని పరిశ్రమముబాపి సిలువ బడినవానికడకు త్సేకమూని మమ్ముజేర్ప ||రమ్ము||
- భక్తవన వసంతదైవమా నీయందు బ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా ముక్తిదాత యేసువిభుని రక్తమహిమ దెల్పియఘ వి ముక్తులనుగజేసి మమ్ము యుక్తమార్గమందు నిలుప ||రమ్ము||
- జీవితపుబాధ లెన్నియో పెనుబ్రోవులగుచు నావరించి మమ్ము దా కిన మాకు నీవె హితుడవగుచు భావమిచ్చి భయముదీర్చి జీవ మైన యేసుపాద సేవకు మముసిద్ధపఱుప ||రమ్ము||
- పలువిధంబులైన చింతలు చెలరేగి మమ్ము కలతపెట్టు నవసరం బున వలనుచెడిన మామనముల మలయు వ్యాకులతను మాన్పి వలయు నాదరణము నిచ్చు పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము||
- తొలిప్రవక్త లెంద రెందఱో నీ ప్రేరణమున బలికినట్టి వేదమందున గల నిగూఢ భావములను దెలుపు నొజ్జవీవెయగుట దెలిపి వాని మమ్ము జ్ఞాన కలితమతుల జేయుకొఱకు ||రమ్ము||
- సడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను బలసమృద్ధి నుద్ధరించి మా యెడదశోధనములకతన బొడము సంశయాంకురంబు లడచి ప్రేమ జ్యోతిమాలో గడుస్థిరముగ వెలుగజేయ ||రమ్ము||
- స్తుతులు నుతులు నీకెచెల్లుగా వుత యుగయుగంబు లతులభక్తిని న్నె కొలుతుము క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య మృతికి మృత్యువైనవాని వితతసింహపీఠిపైని ||రమ్ము||