248
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ ||పరి||
- విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి ||పరి||
- సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి ||పరి||
- వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు దెలుపుమా ||పరి||
- సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా ||పరి||