247
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆపత్కాలమునందు ప్రాపయి మానవజాతి కాపయి సంరక్షించి ఏపారును పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు పాపజాతికి దీప రాశియై రహియించు కృపయు కనికరములు గుంఫించి మధురాతి ప్రభగా భాసిల్లెడు పరమార్థము అపభ్రంశకార్యముల కెపుడు తావీయక సుపురోగతిని జూపి శోధించును ||పరి||
- బండలనుపమించు గుండియల కదలించు నిండుశక్తి ఘటించు నీతి బెంచు ఎండిన యెదలను నిండించు రక్షణో ద్దండ విలసిత భాగ్య దానమ్ములు దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి మెండుగా నాదరము మేళవించి మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల నుండి పాపిని గాచు నండయౌచు ||పరి||
- శాంతి సమాధాన సౌజన్యభావమ్ము కాంతిమంతము గల్గు కారుణ్యము అంతములేనట్టి ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు ఎంతో సంతోషముతో అంతుబొంతులేని వి క్రాంతి బలత్యాగముల గావింప జేయు చింతా ధ్వాంతములోన చెదరికొట్టుకపోవు శాంతిలేని జనతకు సౌఖ్యాస్పదము ||పరి||